1, మార్చి 2013, శుక్రవారం

కన్నీటిచుక్క


అతడు బండి లాగుతాడు
బ్రతుకు బండి లాగడు
బరువులు మోస్తాడు
బాధ్యతలు మొయ్యడు
చమట బొట్లను రూపాయి నోట్లుగా మారుస్తాడు
ఆ రూపాయి నోట్లను సారా చుక్కలుగా మారుస్తాడు
సారా చుక్కలలో షోడాకు బదులు ....
భార్య కన్నీటి చుక్కలు కలుపుకొని తాగుతాడు
 

మళ్ళీ ఎక్క్లడో!


నిండు నూరేళ్ళు వెలగాల్సిన ఆ దీపాలు
అర్ధాంతరంగా ఆరిపోయాయి
ఆశల ఇటుకలతో కట్టుకున్న
కలల సౌధాలు కుప్పకూలిపోయాయి
రుధిరచీర కట్టుకొని
వికట్టాట్టహాసం చేస్తున్న
మ్రుత్యుదేవతల ఆ ప్రాంతం 
మళ్ళీ నగరంలో బాంబుల దాడి  
ప్రత్యక్ష ప్రసారాలు చేస్తూ చానల్స్  
శవాలను లెక్కపెట్టుకుంటూ 
హడావిడిగా ఖాకీలు 
'ఇది దొంగదెబ్బరా 
నేరుగారండి మా తడాకా చూపిస్తాం'  
నిరసనలు వ్యక్తం చేస్తూ కొన్ని గళాలు 
కొన్ని రోజులుపోయాక 
అంతా సద్దుమణిగాక 
నిశ్శబ్దాన్ని బ్రద్దలుచేస్తూ 
మళ్ళీ ఎక్కడో....
బాంబుల దాడి!

15, ఫిబ్రవరి 2013, శుక్రవారం

అదరామృతం



"క్షణాలు గంటల లోకి
 తర్జుమా అవుతున్న
 ఆ పువ్వు పై వాలిన
 ఈ తుమ్మెద కదలదు
 ఆ పెదవుల పై వాలిన
 ఈ పెదవులు విడివడవు
 అదరామృతం పానం చేస్తూ
 తన్మయ రాగాలు ఆలపిస్తూ
 ఆ రెండు దేహాలు
 ఆనందపు రెక్కలు తొడుక్కొని
 అద్బుత లోకాలలో విహరిస్తూ
 ఆ రెండు మనసులు
 బంధాలు తెంచుకుని
 మోక్ష తీరం చేరుతూ
 ఆ రెండు ఆత్మలు"

శిదిల శిల్పం



"ఆమె పాల రాతి బొమ్మ
 వెన్నెల జలపాతం
 ఆమె పారిస్వంగ చెరసాల లొ
 చక్రవర్తులను బందించి
 పరువాల పునాదుల పై
 మహా సామ్రాజ్యం నిర్మించింది
 అందాలతొ విద్వంసం చేసి
 మహా నగరాలను సైతం
 నేల మట్టం చేసింది
 తన అదరాల పై అమృతాన్ని  చిందించిన ఆమె
 శృంగార  సాలి గుటిలొ మగధీరులను బందించిన ఆమె
 హాల హలాన్ని త్రాగి శిదిల శిల్పం గా
 శిలజంగ మారి చరిత్ర గర్బం లొకి జారి
 శాశ్వతంగా నిద్ర పొయింది
 ఆమె క్లియొ పాత్ర కావచ్చు
 ఇంకా ఇంకా ఎవరైనా  కావచ్చు
 చరిత్ర అగాధం లొ అంతుపట్టని రహస్యాలు ఎన్నొ"

1, ఫిబ్రవరి 2013, శుక్రవారం

అక్షరాభిషేకం

అక్షరాభిషేకం 

" ఆమె నడిచే నవల 
ఎగసి పడే చైతన్యపు అల 
ఆమె కదిలే కథ 
మదుర భావ సుధ
ఆమె పెదాల పై చెరగని నవ్వు 
స్నేహ పరిమళాలను రువ్వు 
ఆమె ఆలకించే అక్షరం 
ఆమె మానవత ప్రవాహం 
ఆమె నమ్మదు దైవం,కులం,మతం 
ఆమె కోరును సర్వ జన హితం 
ఆమె సింహపురి సాహితి సిరి 
ఆమె చేస్తారు ఒక వైపు వైద్యం 
మరొక వైపు సాహితి సేద్యం 
రెండు రంగాలలో ఆమె జయ ప్రదం "

(గురు తుల్యులు డా|| పెళ్లకూరు జయప్రద గారి పై అక్షరాభిషేకం )

రెక్కలు

రెక్కలు
1. "వాళ్ళకు కళ్ళు
కనపడవు
అయినా ఎప్పుడూ
పడిపోరు

ఒళ్ళంతా కళ్ళే."

2."ధరల చెట్టు
దిగి రానంటున్నాయి
నిత్య అవసర
సరుకులు

విక్రమార్కుడి ల
సామాన్యుడు."

3."చల్లని గాలి
సోకగానే
మబ్బు కరిగి
వర్షించింది

ఆత్మీయ కరచాలనం."

4."శోకం లోంచి
శ్లోకం
గాయం లోంచి
గేయం

వేదన లోంచే
ఆవిష్కారాలు."

5."మౌన మనే
విమానము నెక్కి
నిలోనికి
ప్రయాణించు

అంతర్యానమే
ధ్యానం."

రచన: మోపూరు పెంచల నరసింహం
నెల్లూరు
సెల్:9346393501

25, జనవరి 2013, శుక్రవారం

రంగుల వల

రంగుల వల 

"నాటి మాయ దర్పణం 
విజ్ఞానపు రెక్కలు తొడుగు కొని 
డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చి కూర్చుంది 
క్షణాలలో విశాల విశ్వాన్ని 
ముంగిట్లోకి తీసుకు వస్తుంది 
అంతర్జాల మహేంద్ర జాలం విసిరినా 
రంగుల వలలో ప్రేమ పక్షులు 
దూర తీరాలు దగ్గర అవుతాయి 
రహస్యాల తెరలు చిరిగి పోతాయి 
స్వార్ధపు కెరటాలు చెలియల కట్ట దాటుతాయి 
సాంకేతిక దీపం లోకి దూకి 
వరుసగా ఆత్మ హత్యలు చేసుకుంటున్న శెలబలు 
స్నేహ సంతకాలు చేసి 
మానవత్వపు జెండా ఎగుర వెయ్యాల్సిన ఫేస్ బుక్ లు 
రక్తాశ్రువులు చిందిస్తున్నయ్యి
మృత్యు ద్వారాలుగా మారుతున్నాయి "

రచన - మోపూరు పెంచల నర సింహం 
సెల్ : 9346393501