29, డిసెంబర్ 2012, శనివారం

కవి పరిచయం.

రాత్రి సూర్యుడు కవి పరిచయం. 

అనంతపురం జిల్లా రాయదుర్గంకి చెందిన కేరే జగదీశ్ (సీనియర్ పాత్రికేయుడు) కస్తూరి పరిమళం (కన్నడిగుడు) అయినప్పటికీ తేనెలొలుకు పలుకులలో కవిత్వం రాస్తున్నారు.

ఆయన తన హృదయాన్ని "సముద్రమంత గాయం " ని చేసుకుని బడుగు జీవుల చిత్రాలు చిత్రించారు. 

ఒక కవి పరిచయం తో.. స్ఫూర్తి పొంది "రాత్రి సూర్యుడు " దీర్ఘ కవిత వ్రాయడానికి శ్రీకారం చుట్టారు. 

అంధుల  అంతః ప్రపంచాన్ని భౌతిక ప్రపంచానికి చూపడానికి ఈ దీర్ఘ  కవిత రాసారు. 

శిశిరంలో కోయిల కూస్తే.ఎడారిలో పూలు పూస్తే .. చీకటి వెలుగవదా !? శాపం వరమవదా !? గుండె గాయం మధుర గేయం అవదా!? 

అదే ఈ రాత్రి సూర్యుడు. 

ఆయన కన్నీటి మేఘాల నుండి ఉదయించిన అక్షర సూరీడే ..ఈ రాత్రి సూరీడు. 

మా ఆత్మ విశ్వాస నక్షత్ర ధగ దగాలు 

మా ఉశ్వాస నిశ్వాసాలు రెప రెపలాడే ఈ విజయాల జెండాలు ఈ కవితలోని అక్షరాలు అంటారు.. ఈ కవికి స్పూర్తిగా నిలిచిన మరొక అంధ కవి. 





kere jagadeesh


అక్షర సూర్యుడు దీర్ఘ కవిత .. ఆవిష్కరణ జరుగుతున్న తేదీ డిసెంబర్ 30 

 రాయ దుర్గం, అనంతపురం జిల్లా 

ఆవిష్కరణ : బుడుగి శ్రీనివాసులు  {జర్మనీ రాయబారి )

ఈ దీర్ఘ  కవిత కి  ముందు మాట వ్రాసిన వారు..  కె. శివా రెడ్డి గారు అద్దేపల్లి రామమోహనరావు గారు. 

సాహితీ మిత్రులందరికీ ఇదే మా ఆహ్వానం

 .

24, డిసెంబర్ 2012, సోమవారం

తెలుగోడి ఘోష

తెలుగోడి ఘోష

అక్షరాలు కళ్ళు తెరిస్తే
అక్షరాలు ఒళ్ళు విదిలిస్తే
అక్షరాలు కి రెక్కలు మొలిస్తే
అక్షరాలు జెండాలై ఎగిరితే
అదే అదే అచ్చమైన స్వచ్చమైన
వాడి అయిన వేడి అయిన తెలుగు బాష 

వెలుగులు విరజిమ్మే బాష
 

నన్నయ్య కలమై నర్తించిన బాష
తిక్కయ్య గళంలో  పంచిన బాష
ఎఱ్రన్న పలుకులలో ఎదిగిన బాష
శ్రీనాధుని పలుకులలో సింగారొలికిన  బాష  
కమనీయంగా కవయిత్రి మొల్ల పలికిన బాష
పోతయ్య పలుకులలో భక్తి తరంగం లోలికిన బాష
వేమయ్య పలుకులలో విరక్తి పంచిన బాష
 

ముద్ద మందారాల బాష ముద్దులొలికె బాష
వెన్నెల జలపాతాల బాష వన్నె చిన్నెల బాష
పదము పదమున అమృతం చిందేటి బాష
ఆపాత మధురమైన బాష
 

అంతం కాబోతుందా నేడు?
కొన  ఊపిరిలో ఉన్న తెలుగు తల్లికి ఊపిరిలూడుతూ
కొడిగడుతున్న తెలుగు దివ్వెను వెలిగిద్దాం.

4, డిసెంబర్ 2012, మంగళవారం

లక్ష్మణ రేఖ





                                                     
                                                             సన్మానం చిత్రాలు


                                      జాషువా పీఠం అందించిన సన్మానసభలో ప్రసంగిస్తున్న నేను.